Nirmala Sitharaman: జీఎస్టీ 2.0తో ఆదాయ లోటు ఉండదు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:41 AM
జీఎస్టీటీ రేట్ల సవరణతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి, ద్రవ్య లోటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. రేట్ల తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని...
ద్రవ్య లోటునూ కట్టడి చేస్తాం
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
న్యూఢిల్లీ: జీఎస్టీటీ రేట్ల సవరణతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి, ద్రవ్య లోటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. రేట్ల తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2025-26)కి అంచనా వేసిన రూ.48,000 కోట్ల ఆదాయ లోటును.. పెరిగే వినియోగం, జీడీపీ వృద్ధి రేటు భర్తీ చేస్తాయన్నారు. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
జీడీపీ మరింత పైకి
జీఎస్టీటీ తాజా సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 6.3-6.8 శాతం జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాన్నీ అధిగమించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఈ సంస్కరణను ఆమె ప్రజా సంస్కరణగా అభివర్ణించారు. దీంతో నిరుపేదలతో సహా దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ ఎంతో కొంత మేలు జరుగుతుందన్నారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనాన్నీ నిశితంగా గమనిస్తున్నట్టు సీతారామన్ తెలిపారు. ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు బలపడడమే ఇందుకు కారణమన్నారు.
డిటర్జెంట్స్, కాస్మెటిక్స్‌కు నిరాశ
అన్ని నిత్యావసర వస్తువులపై పన్ను బాదుడు తగ్గించిన జీఎ్‌సటీ కౌన్సిల్.. రోజువారీ నిత్యావసరమైన డిటర్జెంట్లు, కాస్మెటిక్స్, గృహోపయోగ ఇనిసెక్టిసైడ్స్‌ను మాత్రం కరుణించలేదు. వీటిని 18 శాతం శ్లాబులో కొనసాగించడంపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో పాటు విశ్లేషకులూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇది అనుకోకుండా జరిగిన పొరపాటై ఉండవచ్చని, తుది నోటిఫికేషన్‌లో ప్రభుత్వం దీన్ని సవరించే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. జీఎ్‌సటీ రేటు తగ్గించి ఉంటే దేశంలో కాస్మెటిక్స్ అమ్మకాల వృద్ధి రేటుకు పెద్ద ఊతం లభించి ఉండేదని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ నవీన్ మల్పానీ చెప్పారు.