నిఫ్టీ ఆరో రోజూముందుకే
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:25 AM
స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్పంగా లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల ర్యాలీతోపాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహ వైఖరి, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు సూచీలను...
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్పంగా లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల ర్యాలీతోపాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహ వైఖరి, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 123.42 పాయింట్ల లాభంతో 82,515.14 వద్ద స్థిరపడింది. ఐటీ, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. నిఫ్టీ 37.15 పాయింట్ల వృద్ధితో 25.141.40 వద్ద క్లోజైంది. సూచీ లాభపడటం వరుసగా ఇది ఆరో రోజు. గడిచిన 6 సెషన్లలో నిఫ్టీ 598 పాయింట్లు (2.42 శాతం) పుంజుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 16 రాణించాయి. హెచ్‌సీఎల్ టెక్ షేరు 3.22 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
గేమింగ్, ఈ-స్పోర్ట్స్ కంపెనీ నజారా టెక్నాలజీ్‌సలో ప్రముఖ మార్కెట్ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా వాటాను దాదాపు సగానికి తగ్గించుకున్నారు. ఈ నెల 2-6 తేదీల్లో 1.98 శాతం, 9-10 తేదీల్లో మరో 1.4 శాతం వాటా షేర్లను విక్రయించారు. దాంతో కంపెనీలో ఝున్‌ఝున్‌వాలా వాటా 7.05 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గింది.
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను హిందుస్థాన్ జింక్ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ రూపంలో కంపెనీ మొత్తం రూ.4,225 కోట్లు చెల్లించనుంది.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..