Nifty index ended the week slightly lower: 25,700 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:55 AM
గత వారం నిఫ్టీ మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమై 26,100 వరకు వెళ్లి రియాక్షన్‌కు లోనైంది. కీలక స్థాయి 26,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలం కావడంతో ...
గత వారం నిఫ్టీ మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమై 26,100 వరకు వెళ్లి రియాక్షన్‌కు లోనైంది. కీలక స్థాయి 26,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలం కావడంతో తక్షణ అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించలేకపోయింది. చివరికి వారం మొత్తం మీద 73 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,720 వద్ద క్లోజైంది. గత రెండు వారాలుగా 26,000 వద్ద సుదీర్ఘ కన్సాలిడేషన్ అనంతరం జీవితకాల గరిష్ఠ స్థాయి 26,100 వరకు వెళ్లినప్పటికీ రియాక్షన్ సాధించడం గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది. మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు సైతం ఇదే ధోరణిని ప్రదర్శించాయి. ప్రస్తుత ధోరణిని బట్టి నిఫ్టీ ఈ వారంలో మరింత అప్రమత్త ట్రెండ్‌లో ట్రేడ్ కావచ్చు. కీలక మద్దతు స్థాయి 25,700 వద్ద మరో పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: ప్రస్తుత స్థాయిల్లో పునరుజ్జీవం సాధించినట్టయితే మరింత సానుకూలత కోసం 26,000 పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 26,300. ఇదే గత ఏడాది ఏర్పడిన జీవితకాల గరిష్ఠ స్థాయి.
బేరిష్ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 25,700 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,400. ఇక్కడ రికవరీ ఏర్పడవచ్చు. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 25,000.
బ్యాంక్ నిఫ్టీ: గత రెండు వారాలుగా సైడ్‌వేస్ ధోరణి ప్రదర్శించిన ఈ సూచీ గత వారంలో 57,770 సమీపంలో క్లోజైంది. రికవరీ బాట పడితే 58,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం. ప్రధాన నిరోధం, జీవితకాల గరిష్ఠ స్థాయి 58,600. మద్దతు స్థాయి 57,400. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనపడుతుంది.
పాటర్న్: నిఫ్టీ 25,700 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. నిఫ్టీ ప్రస్తుతం ఇదే స్థాయిలో ఉన్న 25 డిఎంఏ వద్ద ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.