Share News

Nifty: 25,000 వద్ద అప్రమత్తం

ABN , Publish Date - Sep 08 , 2025 | 06:03 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలోనే ప్రారంభమై కీలక స్థాయి 25,000 వరకు వెళ్లినా రియాక్షన్‌కు లోనయింది. చివరికి వారం మొత్తానికి 314 పాయింట్ల లాభంతో 24,740 వద్ద ముగిసింది.

Nifty: 25,000 వద్ద అప్రమత్తం

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలోనే ప్రారంభమై కీలక స్థాయి 25,000 వరకు వెళ్లినా రియాక్షన్‌కు లోనయింది. చివరికి వారం మొత్తానికి 314 పాయింట్ల లాభంతో 24,740 వద్ద ముగిసింది. నిఫ్టీ వారం మధ్య స్థాయిలో ముగియడం అప్రమత్త, అనిశ్చిత ధోరణి సంకే తం. మార్కెట్‌ గత కొద్ది వారాల్లో పరిమిత పరిధిలో చిక్కుకుని 25,000 స్థాయిలో సైడ్‌వేస్‌ ధోరణిలో ట్రేడయింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు కూడా అదే ధోరణి ప్రదర్శించాయి. నిఫ్టీ గత వారం 25,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలం కావడం, శుక్రవారం అమెరికన్‌ ఈక్విటీ మార్కెట్లలో ఏర్పడిన బలహీనత కారణంగా ఈ వారంలో ఇండెక్స్‌ 25,000 కన్నా పైన దృఢంగా నిలబడితే తప్ప అప్రమత్త ధోరణి ప్రదర్శించే ఆస్కారం ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు: మైనర్‌ పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం నిఫ్టీ మైనర్‌ నిరోధం 24,850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక ప్రధాన నిరోధం 25,000. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక పాజిటివ్‌ సూచన వెలువడుతుంది.

బేరిష్‌ స్థాయిలు: ప్రస్తుత స్థాయి 24,700 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,500. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 460 పాయింట్ల మేరకు రికవరీ సాధించి 54,115 వద్ద ముగిసింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 54,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 55,000. బలహీనత ప్రదర్శించినా ప్రధాన మద్దతు స్థాయి 53,500 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది.

పాటర్న్‌: నిఫ్టీ 50, 100 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఆ పైన నిలదొక్కుకోవాలి. అలాగే 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,850, 24,940

మద్దతు : 24,700, 24,580

Updated Date - Sep 08 , 2025 | 06:05 AM