NephroPlus IPO Raises: నేడే నెఫ్రోప్లస్ ఐపీఓ
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:29 AM
డయాలసిస్ సేవల రంగంలోని నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.260 కోట్లు సేకరించింది. ఈ కంపెనీ తొలి పబ్లిక్ ఇష్యూ....
డయాలసిస్ సేవల రంగంలోని నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.260 కోట్లు సేకరించింది. ఈ కంపెనీ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) బుధవారం మార్కెట్లోకి రానుంది. ఎస్‌బీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ సహా 14 కంపెనీలకు ఒక్కోటి రూ.460 ధరకు 56.58 లక్షల షేర్లను కేటాయించినట్టు బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సర్కులర్ తెలిపింది. రూ.871 కోట్ల పరిమాణం గల ఈ ఐపీఓ శుక్రవారంతో ముగుస్తుంది. షేరు ధర శ్రేణిని కంపెనీ రూ.438-460గా నిర్ణయించింది.