NephroPlus IPO: ఈనెల 10 నుంచి నెఫ్రోప్లస్ ఐపీఓ
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:51 AM
నెఫ్రోప్లస్ బ్రాండ్‌నేమ్‌తో డయాలిసిస్ సేవలందిస్తున్న హైదరాబాద్ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈనెల 10న ప్రారంభమై 12న ముగియనుంది...
రూ.353 కోట్ల తాజా ఈక్విటీ జారీ
నెఫ్రోప్లస్ బ్రాండ్‌నేమ్‌తో డయాలిసిస్ సేవలందిస్తున్న హైదరాబాద్ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈనెల 10న ప్రారంభమై 12న ముగియనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.353.4 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 1.27 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది. మొత్తంగా ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,000 కోట్ల వరకు సమీకరించే అవకాశముంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమకరించే నిధుల్లో రూ.129 కోట్లతో భారత్‌లో మరిన్ని డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నెఫ్రోప్లస్ తెలిపింది. మరో రూ.136 కోట్లతో రుణ భారం తగ్గించుకోవడంతోపాటు ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోనుంది.
ఔషధ సంస్థ కరోనా రెమెడీస్ రూ.655 కోట్ల ఐపీఓ ఈనెల 8న మొదలై 10న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.1,008-1,062గా నిర్ణయించింది.