Mutual Fund: 2035కి ఎంఎఫ్ ఆస్తులు రూ.300 లక్షల కోట్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:37 AM
రాబోయే దశాబ్ది కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు అద్భుతమైన వృద్ధి సాధించనుంది. 2035 ఆర్థిక సంవత్సరం నాటికి ఎంఎఫ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ....
న్యూఢిల్లీ: రాబోయే దశాబ్ది కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు అద్భుతమైన వృద్ధి సాధించనుంది. 2035 ఆర్థిక సంవత్సరం నాటికి ఎంఎఫ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూమ్) రూ.300 లక్షల కోట్లు దాటవచ్చునని కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ, ఇన్వె్‌స్టమెంట్ ప్లాట్‌ఫారమ్ గ్రో సంయుక్త నివేదికలో వెల్లడించాయి. ఇందులో ఈక్విటీ హోల్డింగ్స్ విలువ ఒక్కటే రూ. 250 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఆ నివేదికలో స్పష్టం చేశారు. పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం, వేగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, పారదర్శకమైన నియంత్రణలు ఈ భారీ వృద్ధికి దోహదపడనున్నట్లు ‘హౌ ఇండియా ఇన్వెస్ట్’ పేరు తో విడుదల చేసిన ఆ నివేదికలో తెలిపారు. డెరివేటివ్ మార్కెట్‌లో స్పెక్యులేషన్‌ను తగ్గించేందుకు సెబీ తీసుకున్న కఠిన చర్యలతో రిటైల్ పెట్టుబడుదారులు స్థిరమైన ఈక్విటీలవైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ అవగాహనతో 9కోట్ల కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారని, ఈ పెట్టుబడుల్లో చిన్న మొత్తాలే ప్రధానంగా ఉండొచ్చని అంచనా.