Mukesh Amban Topped Forbes List: ముకేశ్ నం.1
ABN , Publish Date - Oct 10 , 2025 | 02:43 AM
దేశంలో అత్యంత ధనవంతులైన 100 మంది వివరాలతో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు...
దేశంలోని 100మంది కుబేరుల్లో అంబానీదే అగ్రస్థానం
గౌతమ్ అదానీ నం.2
సావిత్రి జిందాల్‌కు 3 వ స్థానం
ఫోర్బ్స్ జాబితా విడుదల
లిస్ట్‌లో ఆరుగురు తెలుగువారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ధనవంతులైన 100 మంది వివరాలతో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి 105 బిలియన్ (10,500 కోట్ల) డాలర్లు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.9.32 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ముకేశ్ అంబానీ ఆస్తి 12 శాతం తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. కాగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 92 బిలియన్ డాలర్ల (9,200 కోట్ల డాలర్లు=రూ.8.17 లక్షల కోట్లు) సంపదతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం 40.2 బిలియన్ డాలర్ల (4,020 కోట్ల డాలర్లు=రూ.3.57 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో ఉంది. దేశంలోని టాప్ టెన్ ధనవంతుల్లోని ఏకైక మహిళ ఆమే. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్‌నాడార్ 4,5 స్థానాల్లో నిలిచారు. తెలుగువారి విషయానికొస్తే, ఈ జాబితాలో ఆరుగురికి చోటు లభించింది. తెలుగు సంపన్నుల్లో దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళి దివి అగ్రస్థానంలో ఉన్నారు.