ఎంఎస్ఎన్ రియల్టీ నుంచి వన్ బై ఎంఎస్ఎన్
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:21 AM
ఎంఎ్‌సఎన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎంఎ్‌సఎన్ రియల్టీ.. హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్ రియల్టీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కోకాపేట నియోపోలి్‌సలో..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంఎ్‌సఎన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎంఎ్‌సఎన్ రియల్టీ.. హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్ రియల్టీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కోకాపేట నియోపోలి్‌సలో వన్ బై ఎంఎ్‌సఎన్ పేరుతో 7.7 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో ఈ లగ్జరీ ప్రాజెక్ట్ ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. 55 ఫ్లోర్లతో మొత్తం ఐదు టవర్లలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 655 ఫ్లాట్లు ఉంటాయని ఎంఎ్‌సఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎ్‌సఎన్ రెడ్డి తెలిపారు. 5,250 నుంచి 7,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్స్ ఉంటాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్లాట్ ధర రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనుంది. 2030 నాటికల్లా వన్ బై ఎంఎ్‌సఎన్ పూర్తిగా అందుబాటులోకి రానుందన్నారు.
ఇవి కూడా చదవండి
Beerla Ilaiah: కేటీఆర్‌వి సిగ్గుమాలిన మాటలు
Krishna Water Share Demand: 45 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలి