Montra Electric: విస్తరణ బాటలో మోంట్రా ఎలక్ట్రిక్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:45 AM
మురుగప్పా గ్రూప్‌నకు చెందిన క్లీన్ మొబిలిటీ సంస్థ మోంట్రా ఎలక్ట్రిక్.. హైదరాబాద్‌కు తన కార్యకలాపాలు విస్తరించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మురుగప్పా గ్రూప్‌నకు చెందిన క్లీన్ మొబిలిటీ సంస్థ మోంట్రా ఎలక్ట్రిక్.. హైదరాబాద్‌కు తన కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగంగా సోమవారం నాడిక్కడ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఈ-ఎ్‌ససీవీ) కోసం ప్రత్యేక డీలర్‌షి్‌పను ప్రారంభించింది. శ్రీరామ్ హర్ష భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ డీలర్‌షిప్ కేంద్రాన్ని టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) చైర్మన్ అరుణ్ మురుగప్పన్, ఎండీ జలజ్ గుప్తా, హర్ష గ్రూప్ చైర్మన్ హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జలజ్ గుప్తా మాట్లాడుతూ.. వాణిజ్య ఎలక్టిక్ వాహన (ఈవీ) మార్కెట్లలో హైదరాబాద్ కీలకంగా ఉండటమే కాకుండా లాజిస్టిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించామని, ఈ షోరూమ్‌లో మోంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ శ్రేణి వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా విస్తరణలో భాగంగా రానున్న రోజుల్లో హర్ష గ్రూప్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలలో డీలర్‌షి్‌పలను ఏర్పాటు చేయనున్నట్లు గుప్తా చెప్పారు.