Moldtek Packaging Profit: మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ లాభంలో 35 శాతం వృద్ధి
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:07 AM
మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.22.40 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.22.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.16.53 కోట్లతో పోల్చితే 35.50 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం అమ్మకాలు కూడా 22.28 శాతం వృద్ధితో రూ.196.72 కోట్ల నుంచి రూ.240.55 కోట్లకు పెరిగాయి. నిర్వహణాపరంగా సామర్థ్యాలు పెంచుకోవటంతో పాటు ఉత్పత్తుల వివిధీకరణ, వినియోగదారు ఆధారిత వ్యూహాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి