Mobile Recharge: పెరగనున్న మొబైల్ ఛార్జీలు!
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:56 AM
కొత్త సంవత్సరం మొబైల్ టెలికం సేవల ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి...
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం మొబైల్ టెలికం సేవల ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి. వొడాఫోన్ ఐడియా ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.1,999 నుంచి 12ు, 84 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్ ధరను ఏడు శాతం పెంచింది. ఎయిర్‌టెల్ కూడా రూ.189 ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ.10 పెంచింది. ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్ మాత్రం ధరలు పెంచకుండా, ప్లాన్ చెల్లుబాటయ్యే రోజులను తగ్గించింది. రిలయన్స్ జియో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అదనపు వడ్డింపులు చ్డేస్తుందని భావిస్తున్నారు.