Share News

Investor Recommendations: మిశ్రమ ధోరణిలోనే..

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:55 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్‌టీ సంస్కరణలు చోదక శక్తిగా పనిచేస్తున్నప్పటికీ అమెరికా సుంకాలు, ట్రంప్‌ పదేపదే బెదిరింపు వైఖరితో...

Investor Recommendations: మిశ్రమ ధోరణిలోనే..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్‌టీ సంస్కరణలు చోదక శక్తిగా పనిచేస్తున్నప్పటికీ అమెరికా సుంకాలు, ట్రంప్‌ పదేపదే బెదిరింపు వైఖరితో ప్రకటనలు చేస్తుండటంతో పాటు అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనటం సూచీలకు సరైన దిశ లభించటం లేదు. ప్రస్తుతం మైనింగ్‌, వినియోగం, మెటల్స్‌, ఆటో, ఎలక్ట్రికల్స్‌ రంగాలు మాత్రమే బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆయా రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్న షేర్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే రిస్క్‌, రివార్డును బట్టి ముందుకు వెళ్లటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: కొన్ని నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇప్పుడిప్పుడే బలపడుతోంది. గత శుక్రవారం రూ.269 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.260 పై స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.310 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.255 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ప్రస్తుతం రివర్సల్‌కు సిద్దమవుతోంది. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటమే ఇందుకు కారణం. గత శుక్రవారం రూ.85 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.90 టార్గెట్‌ ధరతో రూ.82 శ్రేణిలో పడే కొద్దీ కొనుగోలు చేయవచ్చు. రూ.80 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.


బీఎ్‌సఈ: ప్రస్తుతం ఈ షేరు అత్యంత ఆకర్షణీయమైన జోన్‌లో ఉంది. జీవితకాల గరిష్ఠం నుంచి దాదాపు 30 శాతం కరెక్షన్‌ జరిగిన తర్వాత పుల్‌బ్యాక్‌ అయ్యేలా కనిపిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.2,319 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,300పై స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.2,250 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఎన్‌ఎండీసీ: కొంతకాలంగా డౌన్‌ట్రెండ్‌లో పయనించిన ఈ కౌంటర్‌లో ఇప్పుడు ట్రెండ్‌ రివర్సల్‌ అవుతోంది. ప్రస్తుతం కీలక నిరోధ స్థాయి రూ.75 వద్ద ఉంది. దీన్ని అధిగమిస్తే మరింత మూమెంటమ్‌ వస్తుంది. గత శుక్రవారం రూ.74.53 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.72 ఎగువన ప్రవేశించి రూ.84 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.69 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

బయోకాన్‌: ఈ షేరు ప్రస్తుతం ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌ వద్ద కదలాడుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. రూ.365 స్థాయిని అధిగమిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.363 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.360 పై స్థాయిలో ప్రవేశించి రూ.410 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.350 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

Updated Date - Sep 08 , 2025 | 05:59 AM