మెడ్‌ప్లస్ లాభం రూ 13 98 కోట్లు
ABN , Publish Date - May 28 , 2025 | 05:36 AM
మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ నాలుగో త్రైమాసికంలో రూ.13.98 కోట్ల స్టాండ్ అలోన్ లాభం ప్రకటించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ నాలుగో త్రైమాసికంలో రూ.13.98 కోట్ల స్టాండ్ అలోన్ లాభం ప్రకటించింది. ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ 9.83 కోట్ల లాభం నమోదు చేసింది. ఆదాయం సైతం రూ.150.27 కోట్ల నుంచి రూ.204.46 కోట్లకు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా కంపెనీ ఆదాయం రూ.473.34 కోట్ల నుంచి రూ.722.03 కోట్ల కు, నికర లాభం రూ.9.44 కోట్ల నుంచి రూ.40.33 కోట్లకు పెరిగాయి.