Car Prices India: ఎర్టిగా బాలెనో ధరల పెంపు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:44 AM
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. ఎర్టిగా, బాలెనో కార్ల ధరలను స్వల్పంగా పెంచింది. ఎర్టిగా మోడల్ ధర 1.4 శాతం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ధర 0.5 శాతం పెంచినట్లు వెల్లడించింది
మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. ఎర్టిగా, బాలెనో కార్ల ధరలను స్వల్పంగా పెంచింది. ఎర్టిగా మోడల్ ధర 1.4 శాతం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ధర 0.5 శాతం పెంచినట్లు వెల్లడించింది. ఈ మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా చేర్చడం ఈ పెంపునకు ప్రధాన కారణమని తెలిపింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం బాలెనో ధర రూ.6.7 లక్షల నుంచి రూ. 9.92 లక్షల మధ్య ఉండగా ఎర్టిగా ధర రూ. 8.97 లక్షల నుంచి రూ.13.25 లక్షల మధ్యన ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..