Share News

Maruti Suzuki and FMCG Companies: మారుతి కార్ల ధర తగ్గింపు

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:43 AM

కొత్త జీఎ్‌సటీ రేట్లు వచ్చే సోమవారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో తమ కార్ల ధరలు తగ్గించాలని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) యాజమాన్యం నిర్ణయించింది. కార్ల శ్రేణిని బట్టి,,,

Maruti Suzuki and FMCG Companies: మారుతి కార్ల ధర తగ్గింపు

న్యూఢిల్లీ: కొత్త జీఎ్‌సటీ రేట్లు వచ్చే సోమవారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో తమ కార్ల ధరలు తగ్గించాలని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) యాజమాన్యం నిర్ణయించింది. కార్ల శ్రేణిని బట్టి ధరల తగ్గింపు రూ.1,29,600 వరకు ఉంటుందని తెలిపింది. జీఎ్‌సటీ రేట్ల కోత ప్రయోజనాన్ని ఈ నెల 22 నుంచి సంపూర్ణంగా కస్టమర్లకే అందించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

ఇదే మంచి సమయం: కారు కొనేందుకు ఇంతకు మించిన మంచి సమయం మరొకటి ఉండదని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు. తాము ఎంట్రీ స్థాయి కార్ల ధరను జీఎ్‌సటీ ప్రయోజనం 8.5 శాతాన్ని మించి తగ్గించామని చెప్పారు. దేశంలో కారు కొనుగోలు చేసే వారి సంఖ్య ప్రతి వెయ్యి మందిలో 34గా ఉన్నదని, అందుకే మార్కెట్‌ అగ్రగామి అయిన తాము ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌

డెయిరీ ఉత్పత్తులపై జీఎ్‌సటీ రేట్లు తగ్గిన నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్టు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకే అందించాలనుకుంటున్నట్టు తెలిపింది. షెల్ఫ్‌ లైఫ్‌ యూహెచ్‌టీ పాల ధర లీటరు రూ.3 మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. అయితే తాజా పాలపై జీఎస్‌ టీ తగ్గించని కారణంగా వాటి ధర యథాతథంగా ఉంటుందని పేర్కొంది. అలాగే నెయ్యి, వెన్న, చీజ్‌ ధర కిలో రూ.50 వంతున, పనీర్‌ ధర కిలో రూ.25 తగ్గుతుంది. ఐస్‌క్రీమ్‌ ధర 950 ఎంఎల్‌ ప్యాక్‌పై రూ.35, 700 ఎంఎల్‌ ప్యాక్‌పై రూ.20 తగ్గుతుంది.

ఐటీసీ

జీఎస్‌టీ రేట్లు తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ విభాగంలోని అన్ని వస్తువుల ధరలూ తగ్గిస్తున్నట్టు ఐటీసీ ప్రకటించింది. ధరల తగ్గింపు ప్రయోజనం ఏ మేరకు ఉన్నదీ కస్టమర్లకు తెలియ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీ.సుమంత్‌ చెప్పారు.


కార్ల ధర

ఎంత తగ్గుతుందంటే

కారు ధర (రూ.లల్లో)

ఎస్‌ ప్రెసో 1,29,600

ఆల్టో కే 10 1,07,600

సెలేరియో 94,100

వ్యాగన్‌-ఆర్‌ 79,600

ఇగ్నిస్‌ 71,300

స్విఫ్ట్‌ 84,600

బాలెనో 86,100

టూర్‌ ఎస్‌ 67,200

డిజైర్‌ 87,700

ఫ్రాంక్స్‌ 1,12,600

బ్రెజ్జా 1,12,700

గ్రాండ్‌ విటారా 1,07,000

జిమ్నీ 51,900

ఎర్టిగా 46,400

ఎక్స్‌ఎల్‌ 6 52,000

ఇన్విక్టో 61,700

ఈకో 68,000

సూపర్‌

క్యారీ ఎల్‌సీవీ 52,100

Updated Date - Sep 19 , 2025 | 05:43 AM