Stock Market: రెండో రోజూ నష్టాల్లోనే..
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:31 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్ తొలి గంటలో 720 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్..
సెన్సెక్స్ 436 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్ తొలి గంటలో 720 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్.. మళ్లీ కాస్త కోలుకుని 436.41 పాయింట్ల నష్టంతో దాదాపు రెండు వారాల కనిష్ఠ స్థాయి 84,666.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 120.90 పాయింట్లు కోల్పోయి 25,839.65 వద్దకు జారుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఈక్విటీ మదుపరులు ప్రైవేట్ బ్యాంకింగ్, ఆయిల్, ఐటీ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగడం ఇందుకు కారణం.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి రూ.89.87 వద్ద ముగిసింది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.4,500 తగ్గుదలతో రూ.1,80,500కు దిగివచ్చింది.