Share News

Indian stock markets: షేరు.. హుషారు

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:29 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 638.12 పాయింట్ల వృద్ధితో 85,567.48 వద్దకు చేరుకుంది...

Indian stock markets: షేరు.. హుషారు

  • 638 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

  • మళ్లీ 26,100 ఎగువ స్థాయికి నిఫ్టీ

  • రూ.4.11 లక్షల కోట్ల సంపద వృద్ధి

  • 2 రోజుల్లో రూ.10 లక్షల కోట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 638.12 పాయింట్ల వృద్ధితో 85,567.48 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 206 పాయింట్లు బలపడి 26,172.40 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించ వచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు ఐటీ, వాహన, లోహ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మరో రూ.4.11 లక్షల కోట్లు పెరిగి రూ.475.32 లక్షల కోట్లకు (5.31 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. గత శుక్రవారం సెన్సెక్స్‌ 447.55 పాయింట్లు, నిఫ్టీ 150.85 పాయింట్లు పెరిగాయి. దాంతో మార్కెట్‌ సంపద రూ.5.42 లక్షల కోట్లు పుంజుకుంది. అంటే, రెండు సెషన్లలో రూ.9.53 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 26 లాభపడ్డాయి.

Updated Date - Dec 23 , 2025 | 03:29 AM