Stock Market: ఆటుపోట్లకు అవకాశం!
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:32 AM
ప్రస్తుతం జీవితకాల గరిష్ఠాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు....
ప్రస్తుతం జీవితకాల గరిష్ఠాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండటంతో పాటు జియో పొలిటికల్ పరిణామాలే ఇందుకు కారణం. అమెరికా డాలర్, ఫెడ్ వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల అంశాలు బెంచ్‌మార్క్ సూచీలను నడిపించనున్నాయి. ప్రస్తుతం ఐటీ, బ్యాంక్, ఆటో, మీడియా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాలు బలంగా కనిపిస్తున్నాయి. మదుపరులు ఎంపిక చేసుకున్న స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
మహీంద్రా అండ్ మహీంద్రా: కొన్ని నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో నెల క్రితం 10 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కన్సాలిడేషన్ పూర్తవగానే మళ్లీ క్రమంగా పెరుగుతోంది. జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. గత శుక్రవారం రూ.3,757 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,700 పై స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.3,950 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.3,660 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్ తప్పనిసరి.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్: కొంతకాలంగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయి వద్దకు చేరుకుంది. ఇక్కడ టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.374 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.370 శ్రేణిలో ప్రవేశించి రూ.410 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.355.
వరుణ్ బెవరేజేస్: జీవితకాల గరిష్ఠం నుంచి దాదాపుగా 40 శాతం పతనమైన ఈ కౌంటర్ మరోసారి కీలకమైన మద్దతు స్థాయి రూ.461 వద్ద బౌన్స్ అయ్యింది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం 480 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.470 పై స్థాయిలో ప్రవేశించి రూ.530 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.460.
ఐఐఎ్‌ఫఎల్: ఈ ఏడాది మార్చి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు జీవితకాల గరిష్టం దగ్గర దిద్దుబాటుకు లోనయ్యాయి. కన్సాలిడేషన్ పూర్తవటంతో మరోసారి బ్రేకౌట్‌కి సిద్ధంగా ఉంది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.578 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.570 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.650/770 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.540.
వేదాంత లిమిటెడ్: కొద్ది రోజుల క్రితం 15 ఏళ్ల గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. అక్కడే కన్సాలిడేషన్ కొనసాగుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పుంజుకుంటోంది. పైగా మెటల్స్‌కు మంచి డిమాండ్ ఉండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.526 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.500 శ్రేణిలో ప్రవేశించి రూ.660 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.485.