Share News

Stock Market: ఖుషీ ఖుషీగా

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:40 AM

ట్రంప్‌ సుంకాలు వాయిదా వేయడంతో స్టాక్‌ మార్కెట్లు జోరుగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,310 పాయింట్లు, నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో ముగిశాయి

Stock Market: ఖుషీ ఖుషీగా

  • సుంకాల అమలు వాయిదాతో మార్కెట్లో జోరుగా కొనుగోళ్లు

  • సెన్సెక్స్‌ 1,310 పాయింట్లు అప్‌

  • మళ్లీ 75,000 ఎగువకు సూచీ

ముంబై: భారత్‌పై 26 శాతం అదనపు సుంకాల అమలును ట్రంప్‌ 90 రోజులు వాయిదా వేయడంతో స్టాక్‌ మదుపరుల్లో సంతోషం ఉప్పొంగింది. వారాంతం ట్రేడింగ్‌లో వారు అమితోత్సాహంతో కొనుగోళ్లు జరపడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,620.18 పాయింట్లు (2.19 శాతం) ఎగబాకి 75,467.33 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,310.11 పాయింట్ల (1.77 శాతం) లాభంతో 75,157.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 524.75 పాయింట్ల (2.34 శాతం) వృద్ధితో 23,000 స్థాయికి చేరువైంది. చివరికి 429.40 పాయింట్ల (1.92 శాతం) పెరుగుదలతో 22,828.55 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.7.85 లక్షల కోట్లు పెరిగి రూ.401.67 లక్షల కోట్లకు (4.66 లక్షలకోట్ల డాలర్లు) చేరింది. ఈ వారం మొత్తానికి మాత్రం సెన్సెక్స్‌ 207.43 పాయిం ట్లు, నిఫ్టీ 75.9 పాయింట్ల నష్టాన్ని చవిచూశాయి.


రూపీ హైజంప్‌: భారత కరెన్సీ విలువ భారీగా పుంజుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్క రోజే 58 పైసలు బలపడి రూ.86.10 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్ఈ.. 22 కోట్ల ఇన్వెస్టర్‌ అకౌంట్లు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) మరో రికార్డును నమోదు చేసింది. ఈ నెలలో ఎన్‌ఎ్‌సఈ ఇన్వెస్టర్‌ ఖాతాలు (యూనిక్‌ క్లయింట్‌ కోడ్స్‌) 22 కోట్ల మైలురాయిని దాటాయి. 2024 అక్టోబరులో ఎక్స్ఛేంజీ ఇన్వెస్టర్ల ఖాతాలు తొలిసారిగా 20 కోట్లకు చేరుకోగా.. ఆరు నెలల్లోనే మరో 2 కోట్ల మేర పెరగడం విశేషం. కాగా, ఈ మార్చి 31 నాటికి ఎన్‌ఎ్‌సఈ రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లకు చేరుకుంది.

ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు11 నెలల కనిష్ఠం

ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి పెట్టుబడులు 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.25,082 కోట్లకు తగ్గాయి. సుంకాల దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనవుతుండటం ఇందుకు కారణం. ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం వరుసగా ఇది మూడో నెల. ఈ ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో పెట్టుబడులు 14 శాతం మేర తగ్గాయి. కాగా, మార్చిలో క్రమానుగుత పెట్టుబడుల పథకాల్లో (సి్‌ప)కి పెట్టుబడులు 4 నెలల కనిష్ఠ స్థాయి రూ.25,925 కోట్లకు పరిమితమయ్యాయి.

Updated Date - Apr 12 , 2025 | 03:46 AM