Market volatility: కొనసాగిన అనిశ్చిత ధోరణి
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:59 AM
గత వారం నిఫ్టీ తీవ్ర ఆటుపోట్ల ధోరణిలో ట్రేడయింది. 26,200 వద్ద తీవ్రమైన రియాక్షన్‌లో పడినా 25,700 స్థాయిలో బలమైన పునరుజ్జీవం సాధించి చివరికి ముందు వారంతో పోల్చితే ......
గత వారం నిఫ్టీ తీవ్ర ఆటుపోట్ల ధోరణిలో ట్రేడయింది. 26,200 వద్ద తీవ్రమైన రియాక్షన్‌లో పడినా 25,700 స్థాయిలో బలమైన పునరుజ్జీవం సాధించి చివరికి ముందు వారంతో పోల్చితే 140 పాయింట్ల నష్టంతో ముగిసింది. గత ఎనిమిది వారాలుగా మార్కెట్ 26,000 స్థాయిలో సైడ్‌వేస్, ఆటుపోట్ల ధోరణి ప్రదర్శిస్తూనే ఉంది. ఈ స్థాయిలో ఎన్ని రియాక్షన్లు ఎదురవుతున్నా కనిష్ఠస్థాయిల్లో అదేవిధంగా పునరుజ్జీవం కూడా సాధిస్తూ వస్తోంది. అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించాలంటే మరో వారం నిలకడగాముగియడం అవసరం. గత శుక్రవారం అమెరికన్ స్టాక్ మార్కెట్ల ధోరణిని బట్టి చూస్తే ఈ వారంలో మరింత అప్రమత్త ట్రెండ్ ప్రదర్శించే ఆస్కారం కనిపిస్తోంది. ఈ కారణంగా 26,000 వద్ద మరోసారి పరీక్షకు గురి కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: సానుకూలత కోసం 26,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఆ పైన మైనర్ నిరోధం 26,160, ప్రధాన నిరోధం 26,300. ఇదే కొద్ది కాలం క్రితం ఏర్పడిన జీవితకాల గరిష్ఠ స్థాయి, స్వల్పకాలిక అవరోధం. గత కొద్ది వారాలుగా ఇక్కడ మూడు మేజర్ టాప్‌లు ఏర్పడ్డాయి.
బేరిష్ స్థాయి: 26,000 వద్ద పరీక్షలో విఫలమైనా ప్రధాన మద్దతు స్థాయి 25,800 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించి స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయి 25,450.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం పరిమిత పరిధిలోనే కదలాడిన ఈ సూచీ 59,390 వద్ద ముగిసింది. సానుకూల ధోరణి సాధించినట్టయితే ప్రధాన నిరోధం 59,600 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. మరో ప్రధాన నిరోధం 60,100. ఇదే జీవితకాల గరిష్ఠ స్థాయి. రియాక్షన్‌లో పడితే ప్రధాన మద్దతు స్థాయి 58,800 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది.
పాటర్న్: మార్కెట్ అనిశ్చిత ధోరణిలో ఉన్నందు వల్ల ట్రెండ్‌లో స్పష్టతకోసం మరో వారం వేచి ఉండాలి. మరింత అప్‌ట్రెండ్ కోసం 26,300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. 25,800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.