Share News

LIC: రద్దయిన పాలసీల పునరుద్దరణ

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:49 AM

ఏవైనా కారణాలతో ప్రీమియం చెల్లించలేక మధ్యలోనే రద్దయిన పాలసీల పునరుద్ధరణకు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గడువు ఇచ్చింది.

LIC: రద్దయిన పాలసీల పునరుద్దరణ

  • అక్టోబరు 17 వరకు అవకాశం: ఎల్‌ఐసీ

న్యూఢిల్లీ: ఏవైనా కారణాలతో ప్రీమియం చెల్లించలేక మధ్యలోనే రద్దయిన పాలసీల పునరుద్ధరణకు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గడువు ఇచ్చింది. ఇందుకోసం ఈ నెల 18 నుంచి అక్టోబరు 17 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడుతోంది. పాలసీ షరతులకు లోబడి ఇంకా పాలసీ గడువు ఉండి, ప్రీమియం చెల్లింపులు ఆపేసిన ఐదేళ్ల లోపు పాలసీలకు మాత్రమే ఈ పునరుద్ధరణ వర్తిస్తుంది. ఇందుకోసం చెల్లించాల్సిన లేటు ఫీజుల్లోనూ రూ.5,000 పరిమితికి లోబడి 30 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఇంకా పాలసీ గడువు ఉండి, మధ్యలో ప్రీమియం చెల్లించడం ఆపేసిన అన్ని నాన్‌-లింక్డ్‌ బీమా పాలసీలను ఈ గడువులోగా పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.

Updated Date - Aug 19 , 2025 | 04:49 AM