IPO Rush in the Market: మార్కెట్లో ఐపీఓ రష్
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:11 AM
ఈక్విటీ మార్కెట్ గత కొద్ది నెలలుగా తీవ్ర ఆటుపోట్లలో ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగుల్చుతున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ ల ద్వారా నిధుల సేకరణ కోసం కంపెనీలు పరుగులు తీస్తూనే ఉన్నా యి...
అక్టోబరు 7న ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్ ఇష్యూ
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ గత కొద్ది నెలలుగా తీవ్ర ఆటుపోట్లలో ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగుల్చుతున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ ల ద్వారా నిధుల సేకరణ కోసం కంపెనీలు పరుగులు తీస్తూనే ఉన్నా యి. ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్ ఇండియా లిమిటెడ్ వచ్చే నెల 7వ తేదీన ఐపీఓ జారీ చేస్తోంది. ఈ ఇష్యూ 9వ తేదీన ముగుస్తుంది. ఇష్యూ పరిమాణం ఎంత అన్నది కంపెనీ ప్రకటించకపోయినా సుమారు రూ.15,000 కోట్లుంటుందని అంచనా. 6వ తేదీన యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారు. హ్యుండయ్ మోటార్స్ తర్వాత భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న రెండో కొరియన్ కంపెనీ ఇది. ఈ ఇష్యూలో భాగంగా మాతృ సంస్థ 10.18 కోట్ల షేర్లను (ఈక్విటీలో 15ు) విక్రయించనుంది. గత డిసెంబరులో ఎల్‌జీ కంపెనీ సెబీకి దరఖాస్తు చేయగా మార్చిలో అనుమతి లభించింది. అయితే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) విధానంలో జారీ అవుతున్న ఇష్యూ కావడం వల్ల ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌కు లభించే ప్రయోజనం ఏమీ ఉండదు.
విరూపాక్ష ఆర్గానిక్స్ ఐపీఓ దరఖాస్తు: తొలి పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ మార్కెట్ నుంచి రూ.740 కోట్ల సేకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా పూర్తిగా తాజా షేర్లు జారీ చేయనున్నట్టు కంపెనీ ఆ దరఖాస్తులో తెలిపింది. ఇందులో రూ.148 కోట్లు ఐపీఓకి ముందు సేకరించే ఆస్కారం ఉన్నట్టు తెలియచేసింది. ఇష్యూ ద్వారా సేకరించే నిధులను సామర్థ్య విస్తరణ కోసం చేసే పెట్టుబడి వ్యయాల కు, రుణభారం తగ్గించుకునేందుకు వినియోగించుకోనున్నట్టు పేర్కొంది. ఇది కాకుండా మరో నాలుగు కంపెనీలు - కామ్‌టెల్ నెట్‌వర్క్స్, ప్రీమియెర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, శంకేష్ జువెలర్స్, విశ్వరాజ్ ఎన్విరాన్‌మెంట్ కూడా పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేయగా ఫెర్టిలిటీ సేవలందించే గాడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ లిమిటెడ్ కంపెనీ సెబీకి సవరణలతో తాజా దరఖాస్తును అందించింది. సర్వీ్‌సగా సాఫ్ట్‌వేర్ (సాస్) సేవలందించే కంపెనీ క్యాపిలరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీఓకు సెబీ ఆమోదముద్ర వేసింది.