Wipro Intelligence: విప్రో ఆదాయం రూ.22,697 కోట్లు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:59 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి క్యూ2 విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన ఒక శాతం పెరిగి...
లాభం రూ.3,246 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన ఒక శాతం పెరిగి రూ.3,246.2 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.3,208.8 కోట్లుగా ఉంది. ఈ క్యూ2లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 1.7 శాతం పెరిగి రూ.22,697.3 కోట్లకు చేరింది. ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం విప్రో లాభం 2.5 శాతం తగ్గగా.. ఆదాయం 2.5 శాతం పెరిగింది. ఈ క్యూ2 ఆదాయంలో 34.3 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎ్‌సఐ) రంగం నుంచి సమకూరింది. కన్స్యూమర్ 18.2 శాతం, ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ రిసోర్సెస్ 17.4 శాతం, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ 15.6 శాతం, హెల్త్‌కేర్ రంగం నుంచి 14.5 శాతం రెవెన్యూ లభించింది.
ఏఐ సేవల కోసం విప్రో ఇంటెలిజెన్స్
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు విప్రో ఇంటెలిజెన్స్‌ను ప్రారంభించింది సంస్థ. ఏఐ పవర్డ్ ప్లాట్‌ఫామ్స్, పరిష్కారాలు, ఆఫరింగ్స్‌తో కూడిన ఈ ఏకీకృత సూట్ ద్వారా కంపెనీ తన క్లయింట్లకు సమగ్ర స్థాయి ఏఐ సేవలందించనుంది. క్లయింట్లు ఏఐ సంబంధిత ప్రాజెక్టులపై ఎక్కువగా వెచ్చిస్తున్నారని విప్రో సీఈఓ, ఎండీ శ్రీనివాస్ పల్లియా అన్నారు.
సంక్షిప్తంగా..
జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ మార్కెట్లోకి విండ్సర్ ఇన్‌స్పైర్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని పీపీఎస్ మోటా ర్స్ ఎల్‌బీనగర్ షోరూమ్‌లో జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా, జోనల్ హెడ్ సౌరవ్ ప్రకాశ్, పీపీఎస్ మోటార్స్ ఎండీ రాజీవ్ సంఘ్వీ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. విండ్సర్‌ను మార్కెట్లోకి తెచ్చిన ఏడాది కాలంలోనే 40,000 పైగా యూనిట్లను విక్రయించినట్లు రైనా వెల్లడించారు.
రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో.. విమాన టికెట్లు, హోటల్స్ బుకింగ్స్ కోసం గోఇబిబో, బస్ బుకింగ్స్‌కు రెడ్‌బస్, రైల్ టికెట్ల కోసం కన్ఫర్మ్‌టికెట్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో మొబిలిటీ రంగంలో వన్ స్టాప్ ట్రావెల్ యాప్‌గా ర్యాపిడో అవతరించింది. అందరికీ అందుబాటులోకి ప్రయాణ, బుకింగ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ కంపెనీలతో జట్టు కట్టినట్లు ర్యాపిడో వెల్లడించింది.
ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.735 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 6ు పెరిగింది. సమీక్షా కాలంలో రుణాల మంజూరు కూడా 25శాతం వృద్ధితో రూ.18,883 కోట్లకు చేరుకుంది.
బ్రిటిష్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ రోల్స్-రాయిస్.. పెరల్ 700, పెరల్ 10ఎక్స్ ఇంజన్ల కోసం ఫ్యాన్ బ్లేడ్స్ తయారీ, సరఫరా కోసం భారత్ ఫోర్జ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి భారత్ నుంచి సప్లయ్ చెయిన్‌ను రెండింతలు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రోల్స్-రాయిస్ వెల్లడించింది.
చైనాలో భారతీయ వీసా దరఖాస్తు సెంటర్ల (ఐవీఎసీఎ్‌స)ల ఏర్పాటు, నిర్వహణ కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి మూడేళ్ల కాలానికి కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇందులో భాగంగా బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌ఝూల్లో ఈ వీసా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
ఎయిర్‌టెల్ క్లౌడ్‌ను మరింతగా విస్తరించేందుకు ఐబీఎంతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఒప్పందంతో ఐబీఎంకు చెందిన కీలక సొల్యూషన్స్‌ను ఎయిర్‌టెల్ క్లౌడ్‌పై అందుబాటులోకి తీసుకురానుంది.
సీఎన్‌హెచ్ బ్రాండ్.. న్యూ హాలెండ్ భారత మార్కెట్లోకి తన కొత్త ట్రాక్టర్ ‘వర్క్‌మాస్టర్ 105 హెచ్‌వీఏసీ క్యాబిన్’ మోడల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.35 లక్షలు. 106 హెచ్‌పీ సామర్థ్యంతో 3.4 లీటర్ల టీఆర్‌ఈఎమ్-4 ఇంజన్‌తో దీన్ని తీసుకువచ్చింది.
ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎ్‌సఎస్) మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన తొలి రెసిడెన్షియల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ ‘ఓలా శక్తి’ని ఆవిష్కరించింది. ఓలా శక్తిని దేశీయంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో తీసుకువచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.