Share News

ఆఖరి గంటలో అమ్మకాలు

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:56 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 217.41 పాయింట్లు కోల్పో యి 74,115.17 వద్దకు జారుకుంది...

ఆఖరి గంటలో అమ్మకాలు

సెన్సెక్స్‌ 217 పాయింట్లు డౌన్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 217.41 పాయింట్లు కోల్పో యి 74,115.17 వద్దకు జారుకుంది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయితో పోలిస్తే, సూచీ ఒక దశలో 700 పాయుంట్లకు పైగా క్షీణించింది. నిఫ్టీ విషయానికొస్తే, 92.20 పాయింట్ల నష్టంతో 22,460.30 వద్ద క్లోజైంది. ఆరంభం నుంచి సూచీలు పాజిటివ్‌గానే ట్రేడవుతూ వచ్చినప్పటికీ, ఆఖరి గంటలో ఇన్వెస్టర్లు ఇండస్ట్రియల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 8 రాణించగా.. 22 నష్టపోయాయి. కాగా బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.43 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.393.86 లక్షల కోట్లకు (4.51 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


అమెరికాలో మాంద్యం భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు

అమెరికా మార్కెట్లను మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల మోతతో దేశ ఆర్థిక ప్రగతి మందగించవచ్చన్న భయాల నేపథ్యంలో యూఎస్‌ స్టాక్‌ సూచీ లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డౌజోన్స్‌ 325 పాయింట్లు (0.8 శాతం) క్షీణించగా.. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 1.9 శాతం, నాస్‌డాక్‌ 3.5 శాతం పతనమయ్యాయి. దాంతో ఎస్‌ అండ్‌ పీ, నాస్‌డాక్‌ 2024 సెప్టెంబరు నాటికి కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 03:38 AM