Share News

Lalitha Jewelry: లలిత జువెలరీ రూ.1,700 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:20 AM

మరో జువెలరీ కంపెనీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. చెన్నై కేంద్రంగా పనిచేసే లలిత జువెలరీ మార్ట్‌ రూ.1,700 కోట్ల సమీకరణ కోసం ఐపీఓ జారీ చేయనుంది...

Lalitha Jewelry: లలిత జువెలరీ రూ.1,700 కోట్ల ఐపీఓ

హైదరాబాద్‌: మరో జువెలరీ కంపెనీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. చెన్నై కేంద్రంగా పనిచేసే లలిత జువెలరీ మార్ట్‌ రూ.1,700 కోట్ల సమీకరణ కోసం ఐపీఓ జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌ 6న కంపెనీ ఇందుకోసం క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుపై సెబీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయక పోవడంతో కంపెనీ ఐపీఓకు మార్గం సుగమమైంది. ఫ్రెష్‌ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,200 కోట్లు, ప్రమోటర్‌ కిరణ్‌ కుమార్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) కింద రూ.500 కోట్ల షేర్లను ఈ ఇష్యూ ద్వారా విక్రయించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లలిత జువెలరీ మార్ట్‌ 57 స్టోర్లు నిర్వహిస్తోంది. కాగా కంపెనీ తమిళనాడులో రెండు మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నిర్వహిస్తోంది.

Updated Date - Oct 07 , 2025 | 06:20 AM