Kotak Mahindra Bank shares: కోటక్ షేర్లు పడేశాయ్
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:14 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయి దాదాపు రెండు నెలల (జూన్ 4 తర్వాత) కనిష్ఠ స్థాయిలో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్...
సెన్సెక్స్ 572 పాయింట్లు పతనం
రెండు నెలల కనిష్ఠానికి సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయి దాదాపు రెండు నెలల (జూన్ 4 తర్వాత) కనిష్ఠ స్థాయిలో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 687 పాయిం ట్లు క్షీణించింది. చివరికి 572.07 పాయింట్ల నష్టంతో 80,891.02 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156.10 పాయింట్లు కోల్పోయి 24,680.90 వద్ద క్లోజైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణం. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 నష్టపోగా.. గత వారాంతంలో నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన కోటక్ బ్యాంక్ షేరు ఏకంగా 7.50 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో షేరు ధర 1.76 శాతం తగ్గింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి