ఏపీలో కైటెక్స్ యూనిట్
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:36 AM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు మరో కంపెనీ సిద్ధమవుతోంది. కేరళ కేంద్రంగా పనిచేసే కైటెక్స్ సంస్థ రాష్ట్రంలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో ఎగుమతుల కోసం దుస్తుల తయారీ యూనిట్...
రూ.4,000 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు మరో కంపెనీ సిద్ధమవుతోంది. కేరళ కేంద్రంగా పనిచేసే కైటెక్స్ సంస్థ రాష్ట్రంలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో ఎగుమతుల కోసం దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ కంపెనీ ఇప్పటికే తెలంగాణలో రూ.3,600 కోట్లతో వరంగల్, హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్ వద్ద చిన్న పిల్లల దుస్తుల తయారీ కోసం రెండు యూనిట్లు ఏర్పాటు చేసింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రూ4,000 కోట్ల భారీ పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
కేరళలో చుక్కెదురు: కేరళకు చెందిన ఈ కంపెనీ యాజమాన్యానికి, అక్కడి సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వానికి పడడం లేదు. గత నెల రోజుల్లోనే కేరళ అధికారులు ఆ రాష్ట్రంలోని కైటెక్స్ యూనిట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే పేరుతో అనేక సార్లు తనిఖీ చేశారు. అయినా ఏమీ తేల్చలేకపోయారు. ఈ తనిఖీలపై కైటెక్స్ సీఎండీ సాబు జాకబ్ బహిరంగంగానే విమర్శించారు. వామపక్ష ఫ్రంట్ పాలనతో రాష్ట్రంలో పరిశ్రమలు సక్రమంగా పనిచేసే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. దీంతో తమ కొత్త యూనిట్లను పత్తి సమృద్ధిగా పండే ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు అమలైతే రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..