Share News

Kinetic DX Electric Scooter: మళ్లీ ద్విచక్ర వాహన మార్కెట్లోకి కైనెటిక్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:19 AM

కైనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్విచక్ర వాహనాల విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. ఒకప్పుడు అద్భుతమైన ప్రజాదరణ పొందిన కైనెటిక్‌ డీఎక్స్‌ స్కూటర్‌లో విద్యుత్‌ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల...

Kinetic DX Electric Scooter: మళ్లీ ద్విచక్ర వాహన మార్కెట్లోకి కైనెటిక్‌

కైనెటిక్‌ డీఎక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల

ధర రూ.1,11,499

న్యూఢిల్లీ: కైనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్విచక్ర వాహనాల విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. ఒకప్పుడు అద్భుతమైన ప్రజాదరణ పొందిన కైనెటిక్‌ డీఎక్స్‌ స్కూటర్‌లో విద్యుత్‌ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌ ఒకసారి చార్జింగ్‌ చేస్తే 116 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కైనెటిక్‌ డీఎక్స్‌, డీఎక్స్‌ ప్లస్‌ పేరుతో అందుబాటులో ఉండనున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర వరుసగా రూ.1,11,449, రూ.1,17,499 (పుణె ఎక్స్‌షోరూమ్‌) గా ఉన్నాయి. కాగా ఉత్పత్తిని, సేల్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాబోయే 18 నెలల కాలంలో రూ.177 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నామని కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ అజింక్యా ఫిరోడియా ఈ సందర్భంగా చెప్పారు. అప్పటికి 6-8ు మార్కెట్‌ వాటాతో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విభాగంలో మూడు అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా నిలవాలన్నది తమ ఆకాంక్ష అన్నారు. దశల వారీగా ఉత్పత్తిని పెంచుతూ ఆ సమయానికి 1.5 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 06:19 AM