Techview: 25000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:50 AM
నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో కొనసాగుతూ వారం మొత్తానికి 300 పాయింట్ల పైగా నష్టంతో 25,150 వద్ద ముగిసింది. ముందువారంలో 25,000 వద్ద ఏర్పడిన బ్రేకౌట్‌కు ఇది పుల్‌బ్యాక్ రియాక్షన్‌గా భావించాలి....
టెక్ వ్యూ: 25000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో కొనసాగుతూ వారం మొత్తానికి 300 పాయింట్ల పైగా నష్టంతో 25,150 వద్ద ముగిసింది. ముందువారంలో 25,000 వద్ద ఏర్పడిన బ్రేకౌట్‌కు ఇది పుల్‌బ్యాక్ రియాక్షన్‌గా భావించాలి. ఫలితంగా మరోసారి 25,000 సమీపంలోకి వచ్చింది. అలాగే మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు కూడా గరిష్ఠ స్థాయిల నుంచి రియాక్షన్ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. టెక్నికల్‌గా ట్రెండ్ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ భద్రత కోసం 25,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం మార్కెట్ ప్రధాన నిరోధ స్థాయి 25,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 25,550. ఇదే స్వల్పకాలిక నిరోధ స్థాయి కావడం వల్ల స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బేరిష్ స్థాయిలు: మరింత బలహీనపడినా భద్రత కోసం 25,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ: గత రెండు వారాల్లో మైనర్ కరెక్షన్ సాధిస్తూ వచ్చిన ఈ సూచీ గత వారం 277 పాయింట్ల నష్టంతో 56,750 వద్ద ముగిసింది. ప్రధాన నిరోధం 57,300. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 57,650. బలహీనపడినా ప్రస్తుత మద్దతు స్థాయి 56,600 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు. ప్రధాన మద్దతు స్థాయి 56,000.
పాటర్న్: నిఫ్టీకి 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి మద్దతు ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ 25 డిఎంఏ కన్నా దిగువకు వచ్చి 25,000 సమీపంలో ఉన్న 50 డిఎంఏకు చేరువవుతోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళ, గురువారాల్లో మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25230, 25300
మద్దతు : 25000, 24940
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే