Karvy Investors: కార్వీ ఇన్వెస్టర్ల క్లెయిమ్‌లకు వచ్చే మార్చి 31 వరకు గడువు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:33 AM
హైదరాబాద్‌కు చెందిన దివాలా బ్రోకింగ్ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కేఎ్‌సబీఎల్ ఇన్వెస్ట ర్లు తమకు సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను...
హైదరాబాద్‌కు చెందిన దివాలా బ్రోకింగ్ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్) ఇన్వెస్ట ర్లు తమకు సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను క్లెయిమ్ చేసుకునేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం గతంలో నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. కార్వీ బ్రోకిం గ్ 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను సొంత అవసరాలకు తాకట్టు పెట్టుకున్న కుంభకోణం 2019లో వెలుగు చూసింది. 2020 నవంబరు 23న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కేఎ్‌సబీఎల్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించింది.