Jio Allianz Partnership: అలియాంజ్‌తో జియో ఫైనాన్స్ జట్టు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:54 AM
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎ్‌ఫఎస్‌ఎల్).. జర్మనీకి చెందిన గ్లోబల్ ఇన్సూరెన్స్ దిగ్గజం అలియాంజ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అలియాంజ్ గ్రూప్ అనుబంధ సంస్థ యూరప్ బీవీతో కలిసి దేశంలో..
రీఇన్సూరెన్స్ కోసం జేవీ ఏర్పాటు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎ్‌ఫఎస్‌ఎల్).. జర్మనీకి చెందిన గ్లోబల్ ఇన్సూరెన్స్ దిగ్గజం అలియాంజ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అలియాంజ్ గ్రూప్ అనుబంధ సంస్థ యూరప్ బీవీతో కలిసి దేశంలో రీఇన్సూరెన్స్ సేవలందించేందుకు జియో ఫైనాన్షియల్ జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయనుంది. చెరి సగం భాగస్వామ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కాగా దేశంలో జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాల్లో కూడా సేవలందించేందుకు మరో రెండు జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు నాన్-బైండింగ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి