మా ఆర్థిక పరిస్థితి గ్రీస్ కంటే ఘోరం
ABN , Publish Date - May 20 , 2025 | 03:21 AM
జపాన్ కూడా ఆర్థిక సంక్షోభానికి చేరువైంది. తమ దేశ ఆర్థిక పరిస్థితి గ్రీస్ కంటే ఘోరంగా ఉందని సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా ప్రకటించారు. ప్రభుత్వ అప్పుల భారం...
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా
టోక్యో: జపాన్ కూడా ఆర్థిక సంక్షోభానికి చేరువైంది. తమ దేశ ఆర్థిక పరిస్థితి గ్రీస్ కంటే ఘోరంగా ఉందని సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా ప్రకటించారు. ప్రభుత్వ అప్పుల భారం జీడీపీలో 260 శాతాన్ని మించి పోయిందన్నారు. జీ-7 సంపన్న దేశాల్లో మరే దేశ ప్రభుత్వ రుణ భారం ఈ స్థాయిలో లేదు. వృద్ధుల జనాభా పెరిగిపోవడం, సంక్షేమ పథకాల భారం గుదిబండలా మారడం, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇందుకు కారణమని ప్రధాని స్పష్టం చేశారు. ఇక అప్పులు చేసి పన్నుల కోత సాధ్యం కాదని చెప్పారు. 2010లో జపాన్ రుణ భారం జీడీపీలో 218 శాతానికి చేరినప్పుడూ అప్పటి ప్రధాని ఇలానే హెచ్చరించారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..