Share News

ఐటీఆర్‌ యూ నోటిఫై చేసిన ఐటీ శాఖ

ABN , Publish Date - May 21 , 2025 | 02:39 AM

ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఇక నాలుగేళ్ల క్రితం వరకు తమ అప్‌డేటెడ్‌ ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్‌లు ఫైల్‌ చేయవచ్చు. ఐటీ శాఖ ఇందుకోసం ఐటీఆర్‌-యూ పేరుతో కొత్త...

ఐటీఆర్‌ యూ నోటిఫై చేసిన ఐటీ శాఖ

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఇక నాలుగేళ్ల క్రితం వరకు తమ అప్‌డేటెడ్‌ ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్‌లు ఫైల్‌ చేయవచ్చు. ఐటీ శాఖ ఇందుకోసం ఐటీఆర్‌-యూ పేరుతో కొత్త ఫారాన్ని విడుదల చేసింది. ఇంతకు ముందు ఈ గడువు రెండేళ్ల వరకు మాత్రమే ఉండేది. 2025 బడ్జెట్‌లో ఈ గడువును నాలుగేళ్లకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఏడాది నుంచి రెండేళ్ల అప్‌డేటెడ్‌ రిటర్న్‌లపై అదనంగా 25, 50 శాతం పన్ను చెల్లించాలి. అదే మూడు నుంచి నాలుగేళ్ల అప్‌డేటెడ్‌ రిటర్న్‌లు ఫైల్‌ చేస్తే 60, 70 శాతం అదనపు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ తెలిపింది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:39 AM