Share News

హైదరాబాద్‌లో ఐటీసీ వెల్‌కమ్‌ హోటల్‌

ABN , Publish Date - May 21 , 2025 | 02:44 AM

ఐటీసీ హోటల్స్‌ హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా శంకర్‌పల్లిలో 155 రూమ్స్‌తో ఐటీసీ వెల్‌కమ్‌ హోటల్‌ను...

హైదరాబాద్‌లో ఐటీసీ వెల్‌కమ్‌ హోటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐటీసీ హోటల్స్‌ హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా శంకర్‌పల్లిలో 155 రూమ్స్‌తో ఐటీసీ వెల్‌కమ్‌ హోటల్‌ను ప్రారంభిస్తోంది. ఇందుకోసం కేఏసీ పామ్‌ ఎగ్జోటికా హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌లో ఆల్‌ డే డైనింగ్‌, ప్రత్యేక రెస్టారెంట్‌, బార్‌, స్విమ్మింగ్‌ పూల్‌, లాంజ్‌, స్పా, కిడ్స్‌ క్లబ్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపింది. ఐటీసీ హోటల్స్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీసీ కాకతీయ, ఐటీసీ కోహినూర్‌ పేరుతో రెండు సొంత హోటల్స్‌ ఉన్నాయి. వెల్‌కమ్‌ బ్రాండ్‌తో హైదరాబాద్‌లో శంకర్‌పల్లిలో తొలి స్టార్‌ హోటల్‌ను నిర్వహించబోతోంది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:44 AM