విశాఖలో ఐటీసీ కొత్త స్టార్ హోటల్
ABN , Publish Date - May 16 , 2025 | 04:48 AM
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సొంత స్టార్ హోటల్ నిర్మాణానికి ఐటీసీ హోటల్స్ సిద్ధమైంది. రూ.328 కోట్ల పెట్టుబడితో 200 రూమ్స్‌తో నిర్మించే ఈ హోటల్‌ను 2029 నాటికి...
రూ.328 కోట్ల పెట్టుబడి. 2029 నాటికి పూర్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సొంత స్టార్ హోటల్ నిర్మాణానికి ఐటీసీ హోటల్స్ సిద్ధమైంది. రూ.328 కోట్ల పెట్టుబడితో 200 రూమ్స్‌తో నిర్మించే ఈ హోటల్‌ను 2029 నాటికి పూర్తి చేయనుంది. ఐటీసీ హోటల్స్ ఇప్పటికే వైజాగ్‌లో ‘వెల్‌కం దేవీ గ్రాండ్ బే, ఫార్చూన్ ఇన్ శ్రీకన్య’ పేరుతో రెండు స్టార్ హోటల్స్‌ను తన అనుబంధ సంస్థల ద్వారా లీజు పద్దతిలో నిర్వహిస్తోంది. ఇందులో ‘వెల్‌కం దేవీ గ్రాండ్ బే’ హోటల్‌లో 104 రూమ్స్, ‘ఫార్చూన్ ఇన్ శ్రీకన్య’ హోటల్‌లో 68 రూమ్స్ ఉన్నాయి. కాగా మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.1,060.62 కోట్ల ఆదాయంపై రూ.257.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..