రూ 1 45 లక్షల కోట్ల ఐపీఓలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:44 AM
ట్రంప్ సుంకాలతోపాటు భౌగోళిక రాజకీయ అని శ్చితుల ప్రభావం నుంచి ఈక్విటీ మార్కెట్ క్రమంగా కోలు కుంటోంది. 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టీ 15 శాతం మేర ఎగబాకింది..
ప్రైమరీ మార్కెట్లో మళ్లీ సందడి
ముంబై: ట్రంప్ సుంకాలతోపాటు భౌగోళిక రాజకీయ అని శ్చితుల ప్రభావం నుంచి ఈక్విటీ మార్కెట్ క్రమంగా కోలు కుంటోంది. 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టీ 15 శాతం మేర ఎగబాకింది. ఐపీఓల సందడి కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం.. ప్రస్తుతం 75కు పైగా కంపెనీలు సెబీ నుంచి ఐపీఓకు అనుమతి పొంది, పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. ఈ కంపెనీలు మార్కెట్ నుంచి మొత్తం రూ.1.45 లక్షల కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. మరో రూ.90,000 కోట్లకు పైగా విలువైన 65 కంపెనీల ఐపీఓలు సెబీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి రూ.2.35 లక్షల కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది.
గత నెల నుంచి మళ్లీ గాడిలోకి..
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో దాదాపుగా స్తంభించిపోయిన ఐపీఓ మార్కెట్‌లో గత నెల నుంచి మళ్లీ కదలిక మొదలైంది. 10కి పైగా కంపెనీలు పబ్లిక్ ఆఫరింగ్‌ల ద్వారా రూ.20,000 కోట్ల వరకు సమీకరించాయి. మున్ముందు ఇష్యూల జోరు మరింత పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 105 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.2.11 లక్షల కోట్లకు పైగా నిధులు సేకరించాయి.
రియల్టీ రంగంలోనూ జోష్
స్థిరాస్తి రంగంలోని పలు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. నోయిడాకు చెందిన బీపీటీపీ లిమిటెడ్, ఎం3ఎం గ్రూప్‌నకు చెందిన స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్, గౌర్‌సన్స్ ఇండియా, వాద్వా గ్రూప్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు ఐపీఓల ద్వారా రూ.15,000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉంది.
పెరగనున్న దరఖాస్తులు
ఐపీఓకు వచ్చేందుకు సెబీకి కంపెనీల దరఖాస్తులు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ, ఫిన్‌టెక్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి నవతరం కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు అధిక ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఎంటీఆర్, ఈస్టర్న్ మసాలా బ్రాండ్ల యా జమాన్య సంస్థ ఓర్ల్కా ఇండియా కూడా ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. మర్చం ట్ పేమెంట్స్ సేవల సంస్థ పైన్ ల్యాబ్స్ కూడా సెబీకి దరఖాస్తు సమర్పించనున్నట్లు తెలిపింది. ఐపీఓ ద్వారా సంస్థ రూ.5,000-6,000 కోట్ల వరకు సమీకరించవచ్చని సమాచారం. ఈ-కామర్స్ కంపెనీ మీషో కూడా ఐపీఓకు సిద్ధమైంది. 8,500 కోట్ల వరకు సమీకరించేందుకు ఈనెలలోనే డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేయవచ్చని తెలిసింది.
సెబీ అనుమతి పొందిన కొన్ని బడా ఐపీఓలు
కంపెనీ (రూ.కోట్లు)
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 12,500
ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియా 15,000(అంచనా)
హీరో ఫిన్‌కార్ప్ 3,668
ఎన్‌ఎ్‌సడీఎల్ 3,420 (అంచనా)
విక్రమ్ సోలార్ 1,500
కరంతార ఇంజనీరింగ్ 1,750
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..