Share News

లాభాల్లో ఇండిగో రికార్డు

ABN , Publish Date - May 22 , 2025 | 05:21 AM

పౌర విమానయాన సంస్థ ఇండిగో చరిత్రలోనే రికార్డు లాభాలను 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం (క్యూ4)లో నమోదు చేసింది. ప్రయాణాల డిమాండ్‌ బలంగా...

లాభాల్లో ఇండిగో రికార్డు

క్యూ4లో రూ.3,067 కోట్లు

న్యూఢిల్లీ: పౌర విమానయాన సంస్థ ఇండిగో చరిత్రలోనే రికార్డు లాభాలను 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం (క్యూ4)లో నమోదు చేసింది. ప్రయాణాల డిమాండ్‌ బలంగా ఉండడంతో క్యూ4లో రూ.3,067.5 కోట్ల లాభం ఆర్జించింది. గత ఏడాది ఆర్జించిన లాభం రూ.1,894.8 కోట్లతో పోల్చితే ఇది 62ు అధికం. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.18,505.1 కోట్ల నుంచి రూ.23,097.5 కోట్లకు పెరిగింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. 2024-25లో ఇండిగో 3.19 కోట్ల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చింది.

ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 05:21 AM