భారత్-రష్యా చమురు వాణిజ్యంలో భారీ పెరుగుదల
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:43 AM
భారత రిఫైనరీలు పశ్చిమాసియాపై ఆధారనీయతను తగ్గించుకుంటూ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుతున్నాయి. చమురు నిల్వలను...
11 నెలల గరిష్ఠ స్థాయికి దిగుమతులు
న్యూఢిల్లీ: భారత రిఫైనరీలు పశ్చిమాసియాపై ఆధారనీయతను తగ్గించుకుంటూ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుతున్నాయి. చమురు నిల్వలను పెంచేందుకు అవి చురుగ్గా కొనుగోళ్లకు దిగిన నేపథ్యంలో జూన్ నెలలో రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గత 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రోజుకు 20.8 లక్షల బ్యారెళ్ల సరఫరాతో రష్యా మళ్లీ భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. అంతర్జాతీయ కమోడిటీ సంస్థ కెప్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్‌లో దేశానికి మొత్తం ముడిచమురు దిగుమతులు 6 శాతం తగ్గినప్పటికీ, రష్యా నుంచి వచ్చే చమురు పరిమాణం మాత్రం నెలవారీగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2024 జూలై తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే