India IPO Market: ఏటా రూ.1.80 లక్షల కోట్ల ఐపీఓలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:42 AM
భారత్‌లో ఏటా ఐపీఓల ద్వారా 2,000 కోట్ల డాలర్ల సుమారు రూ.1.80 లక్షల కోట్లు సమీకరణ సాధారణంగా మారిందని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా నివేదిక పేర్కొంది....
ఈ ఏడాది రూ.2.07 లక్షల కోట్ల సమీకరణఫ జేపీ మోర్గాన్ నివేదిక
ముంబై: భారత్‌లో ఏటా ఐపీఓల ద్వారా 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్లు) సమీకరణ సాధారణంగా మారిందని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా నివేదిక పేర్కొంది. మరి కొన్నేళ్లపాటు వార్షిక ఐపీఓల నిధుల సమీకరణకు ఇది ప్రామాణిక స్థాయి కానుందని ఈ సంస్థలో ఈక్విటీ మార్కెట్స్ అధిపతి అభినవ్ భారతి మంగళవారం అన్నారు. ఈ ఏడాదిలో కంపెనీల ఆఫరింగ్‌ల విలువ ఇప్పటికే 2,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.89 లక్షల కోట్లు) చేరిందని, ఇది గత ఏడాది సాధించిన స్థాయని సంస్థ ఆ నివేదికలో ప్రస్తావించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రూ.10,000 కోట్ల భారీ ఆఫరింగ్ ఈ నెలలోనే పూర్తి కానుంది. వచ్చే 2-3 వారాల్లో మరి న్ని బడా కంపెనీలు ఆఫరింగ్‌కు రానున్నాయి. కాబట్టి, 2025 చివరినాటికి ఐపీఓల మొత్తం విలువ 2,300 కోట్ల డాలర్లకు (రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ నివేదిక అంచనా వేసింది. అభినవ్ భారతి ఇంకా ఏమన్నారంటే..
ఐపీఓకు వస్తున్న కంపెనీల్లో దాదాపు 20 శాతం కన్స్యూమర్ టెక్నాలజీ, ఆధునిక వ్యాపార కంపెనీలే. వచ్చే ఐదేళ్లలో ఈ వాటా 30 శాతానికి మించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో వేల కోట్ల విలువ చేస్తున్న కనీ సం 20 స్టార్ట్‌పలు సమీప భవిష్యత్‌లో ఐపీఓకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.
4-5 కంపెనీలు ఐపీఓ ద్వారా 100 కోట్ల డాలర్లకు (రూ.9,000 కోట్లు) పైగా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి 800 కోట్ల డాలర్ల వరకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి.
ఐదు ఇష్యూలకు సెబీ ఆమోదం
సప్లై చెయిన్ అసెట్ పూలింగ్ కంపెనీ లీప్ ఇండియా, ఎల్డోరాడో అగ్రిటెక్ సహా ఐదు కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది. మోల్బయో డయాగ్నోస్టిక్స్, క్యాటరింగ్/ఫుడ్ రిటైలింగ్ చెయిన్ కంపెనీ ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్, వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ సొల్యూషన్స్ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, స్కై అల్లాయ్స్ అండ్ పవర్ కంపెనీలు ఐపీఓ పత్రాలను ఉపసంహరించుకున్నాయి.
పరిశ్రమలకు ఆవిరి, గ్యాస్ సరఫరా చేసే స్టీమ్‌హౌస్ ఇండియా సెబీకి నవీకరించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.425 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
సిటియస్ ట్రాన్స్‌నెట్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్ ఐపీఓ ద్వారా రూ.1,340 కోట్ల వరకు నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది.