Share News

ఒడుదుడుకుల్లోనూ లాభాలొచ్చాయ్‌

ABN , Publish Date - May 15 , 2025 | 03:29 AM

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ లాభాలు నమోదు చేశాయి. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్ఠ స్థాయి 3.16 శాతానికి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు...

ఒడుదుడుకుల్లోనూ లాభాలొచ్చాయ్‌

8182 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

  • రూ.4 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ లాభాలు నమోదు చేశాయి. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్ఠ స్థాయి 3.16 శాతానికి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు కొనసాగడంతో పాటు మెటల్‌, ఇండస్ట్రియల్‌ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌ 182.34 పాయింట్ల వృద్ధితో 81,330.56 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 88.55 పాయింట్ల లాభంతో 24,666.90 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.79 లక్షల కోట్లు పెరిగి రూ.434.89 లక్షల కోట్లకు (5.10 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.

ఆసియా మార్కెట్లలో భారత్‌ భేష్‌

భారత్‌ జపాన్‌ను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ప్రాధాన్య ఈక్విటీ మార్కెట్‌గా నిలిచింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తాజాగా నిర్వహించిన ఆసియా ఫండ్‌ మేనేజర్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న ఫండ్‌ మేనేజర్లలో 42 శాతం భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఈ విషయంలో జపాన్‌ రెండో స్థానానికి జారుకోగా.. గతనెల అట్టడుగు స్థాయిలో నిలిచిన చైనా మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 03:29 AM