Share News

Indian Stock Market Ends Lower: రెండో రోజూ నష్టాలే

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:52 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 పాయింట్ల వద్ద ముగియగా...

Indian Stock Market Ends Lower: రెండో రోజూ నష్టాలే

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 35.05 పాయింట్ల నష్టంతో 26,142.10 వద్ద ముగిసింది. ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులే ఉండడం, సంవత్సరాంతపు సెలవులతో ట్రేడింగ్‌ పరిమాణం కూడా బాగా తగ్గింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కూడా బుధవారం సూచీలను కిందికి లాగాయి. ఈ నెలాఖరు వరకు ట్రేడింగ్‌ ఇలానే ఉంటుందని భావిస్తున్నారు. రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఇండిగో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది.

  • అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి 8 పైసలు దిగజారి 89.71 వద్ద ముగిసింది.

నేడు సెలవు: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా మార్కెట్లకు నేడు సెలవు. ఈక్విటీ, ఫారెక్స్‌, కమోడిటీ మార్కెట్లు పని చేయవు.

Updated Date - Dec 25 , 2025 | 05:52 AM