Indian Stock Market: 3 రోజుల తర్వాత లాభాల్లోకి
ABN , Publish Date - Dec 12 , 2025 | 02:29 AM
వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 426.86 పాయింట్ల...
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 426.86 పాయింట్ల వృద్ధితో 84,818.13 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 140.55 పాయింట్లు బలపడి 25,898.55 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరో 0.25 శాతం తగ్గించడంతోపాటు వాహనం, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 రాణించాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..