Share News

Indian Job Market: ఆశాజనకంగా కొలువుల మార్కెట్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:40 AM

జీడీపీ జోరు ప్రభావం దేశంలో కొలువుల మార్కెట్‌పై కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి మార్చి మధ్య కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి....

Indian Job Market: ఆశాజనకంగా కొలువుల మార్కెట్‌

  • క్యూ1లో 52 శాతం పెరిగే అవకాశం

న్యూఢిల్లీ: జీడీపీ జోరు ప్రభావం దేశంలో కొలువుల మార్కెట్‌పై కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ డిసెంబరుతో ముగిసే త్రైమాసికంలో 27 శాతంగా ఉండే నికర నియామకాలు మార్చి చివరికి 52 శాతానికి చేరనున్నట్టు మాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చినా ఇది 30ు ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం వచ్చే మూడు నెలల్లో బ్రెజిల్‌ (54ు) తర్వాత మన దేశంలోనే అత్యధిక నికర నియామకాలు పెరగునున్నాయి.

నివేదిక ఇతర ప్రధాన అంశాలు

  • అంచనాలకు మించి పెరుగుతున్న భారత జీడీపీ వృద్ధిరేటు.

  • చక్కటి వర్షాలతో పుంజుకున్న గ్రామీణ డిమాండ్‌.

  • ఫ తగ్గిన ముడి చమురు ధరలతో అదుపులోకి వచ్చిన ద్రవ్యోల్బణం.

  • పోటీ మార్కెట్‌లో నెగ్గేందుకు వీలుగా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్న కంపెనీలు.

  • ఫైనాన్స్‌, బీమా రంగాల్లో అత్యధిక (61ు) నికర నియామకాలు.

  • నియామకాలకు దోహదం చేయనున్న కంపెనీల విస్తరణ, టెక్‌ అడ్వాన్స్‌మెంట్‌లు.

  • నైపుణ్యాలున్న అభ్యర్ధులకు కొలువులే కొలువులు.

Updated Date - Dec 10 , 2025 | 05:40 AM