Share News

FM Sitharaman: మన ఆర్థికం పటిష్ఠం

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:55 AM

ప్రపంచవ్యాప్తంగా పలు ఆటుపోట్లున్నప్పటి కీ మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు....

FM Sitharaman: మన ఆర్థికం పటిష్ఠం

అంతర్జాతీయ ఆటుపోట్లపై బేఫికర్‌ జూ ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు ఆటుపోట్లున్నప్పటి కీ మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు స్థిరీకరణ శక్తిలా మారిందన్నారు. గత పదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మన ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సవాళ్లనైనా తట్టుకునే స్థితికి చేరిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ‘కౌటిల్య ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌, 2025’ సదస్సులో సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయ వినియోగం, పెట్టుబడులే మన ఆర్థిక వ్యవస్థకు శ్రీరామరక్షగా మారాయన్నారు. పలు సానుకూల అంశాలున్నా ఎలాంటి అలసత్వానికి తావు లేదని హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలు, సుంకా లు, పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను మార్చివేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆమె గతంలో ఎన్నడూ లేని అనిశ్చితి, ఆటుపోట్ల యుగమని ఆమె అభివర్ణించారు.

ప్రైవేటు పెట్టుబడులు: పెరుగుతున్న వ్యాపారావకాశాలతో ప్రైవేటు రంగం పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించిందని, ముఖ్యంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీ పీ) ప్రాజెక్టులపై రఆసక్తి చూపిస్తోందని చెప్పారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఏటికేటికీ ప్రభుత్వ మూల ధన పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.11.21 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడుల లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 02:55 AM