విదేశీ కంపెనీలపై పారాహుషార్
ABN , Publish Date - May 20 , 2025 | 03:41 AM
దొడ్డి దారిన భారత కంపెనీలను చేజిక్కించుకునే విదేశీ కంపెనీలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలనూ...
విదేశీ పెట్టుబడులపైనా సమీక్ష
న్యూఢిల్లీ: దొడ్డి దారిన భారత కంపెనీలను చేజిక్కించుకునే విదేశీ కంపెనీలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలనూ సమీక్షిస్తున్నట్లు సమాచారం. దాదాపు తుది దశకు చేరిన కొత్త నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని భావిస్తున్నారు. చైనాతో సహా భారత్‌తో భూ, సముద్ర సరిహద్దులు ఉన్న దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐపై ఇప్పటికే అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ కంపెనీలు భారత్‌లో సొంత కంపెనీలు పెట్టాలన్నా లేదా స్థానిక సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీలు ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయినా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు దొడ్డి దారిన దేశీయ కంపెనీల ముసుగులో భారత్‌లో తమ సొంత వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కొత్త నిబంధనలతో దేశంలోని విదేశీ కంపెనీలు తమ వాటాలు బదిలీ చేయాలన్నా ప్రభుత్వ ముందస్తు అనుమతిని తప్పనిసరి చేయబోతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..