India Smartphone Exports: అమెరికాకు పెరిగిన భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:53 AM
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ మన దేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి....
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ మన దేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి. అక్టోబర్ నెలలో భారత్ నుంచి యూఎ్‌సకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లకు పైగా పెరిగి 147 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 12,936 కోట్ల) చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.4,048 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో రూ.94,864 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమెరికాకు ఎగుమతైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 31,680 కోట్లతో పోలిస్తే మూడింతలు అధికం.