Share News

గత ఏడాది భారత్‌లో కొత్తగా 39000 మిలియనీర్లు

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:39 AM

ప్రపంచంలో ఆర్థిక వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. ఇదే సమయంలో డాలర్‌ మిలియనీర్ల (10 లక్షల డాలర్లు) సంఖ్యా పెరిగి పోతోంది. గత ఏడాది మన దేశంలో కొత్తగా 39,000 మంది...

గత ఏడాది భారత్‌లో కొత్తగా 39000 మిలియనీర్లు

మొత్తం 9.17 లక్షలకు చేరిక

అమెరికాలో గంటకు 1,000 మంది

యూబీఎస్‌ ‘గ్లోబల్‌ వెల్త్‌’ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆర్థిక వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. ఇదే సమయంలో డాలర్‌ మిలియనీర్ల (10 లక్షల డాలర్లు) సంఖ్యా పెరిగి పోతోంది. గత ఏడాది మన దేశంలో కొత్తగా 39,000 మంది ఈ జాబితాలో చేరారు. దీంతో మన దేశంలో డాలర్‌ మిలియనీర్ల సంఖ్య 9.17 లక్షలకు చేరింది. అయితే చైనాలో ఉన్న 63 లక్షల మిలియనీర్లతో పోలిస్తే మన దేశంలో ఉన్న మిలియనీర్ల సంఖ్య తక్కువే. 2023తో పోలిస్తే భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 4.4 శాతం పెరిగింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ యూబీఎస్‌ తన తాజా ‘గ్లోబల్‌ వెల్త్‌’ నివేదికలో ఈ విషయం వెల్లడించింది. రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాలతో పోల్చినా మన దేశంలోనే డాలర్‌ మిలియనీర్ల సంఖ్య ఎక్కువ.


నివేదిక ఇతర ముఖ్యాంశాలు

  • 2024 నాటికి 119 లక్షల కోట్ల డాలర్లకు చేరిన ప్రపంచ మిలియనీర్ల ఆస్తుల విలువ

  • గత ఏడాది అమెరికాలో గంటకు 1,000 మంది చొప్పున ఏడాదిలో 3.79 లక్షల మంది కొత్త మిలియనీర్లు

  • ప్రపంచ మిలియనీర్లలో 40 శాతం మంది అమెరికన్లు

  • మిలియనీర్ల పెరుగుదలలో టర్కీ, యూఏఈ, రష్యా తర్వాత భారత్‌కు నాలుగో స్థానం.

  • ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న 56 దేశాల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం

  • భారత్‌లోని మొత్తం ఆస్తుల్లో ఫైనాన్షియల్‌ (ఆర్థిక) ఆస్తుల వాటా

    20 శాతం మాత్రమే

  • వచ్చే పాతికేళ్లలో ఒక తరం నుంచి మరో తరానికి 83 లక్షల కోట్ల డాలర్ల ఆస్తుల బదిలీ. ఈ విషయంలో అమెరికాకు అగ్రస్థానం.

    భారత్‌కు ఏడో స్థానం

  • గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులు సగటున 4.6 శాతం చొప్పున పెరిగితే అమెరికాలో 11 శాతం చొప్పున పెరుగుదల.

Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 20 , 2025 | 05:39 AM