Share News

IMTEX Forming 2026: జనవరి 21 నుండి 25 తేదీల్లో ఐఎంటీ ఎక్స్‌పో

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:17 AM

ఇండియన్‌ మెషిన్‌ టూల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎంటీఎంఏ).. జనవరి 21-25 తేదీల్లో బెంగళూరులో ఐఎంటీఎక్స్‌ ఫార్మింగ్‌ 2026 సదస్సును...

IMTEX Forming 2026: జనవరి 21 నుండి 25 తేదీల్లో ఐఎంటీ ఎక్స్‌పో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ మెషిన్‌ టూల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎంటీఎంఏ).. జనవరి 21-25 తేదీల్లో బెంగళూరులో ఐఎంటీఎక్స్‌ ఫార్మింగ్‌ 2026 సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద మెట ల్‌ ఫార్మింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ సదస్సు ఇదని గురువారం నాడిక్కడ ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్‌ మోహిని కేల్కర్‌ తెలిపారు. ఈ సదస్సులో 22 దేశాలకు చెందిన 600 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. మేకిన్‌ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ)తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు ఈ రంగ అభివృద్ధికి ఊతంగా నిలవనున్నాయని కేల్కర్‌ పేర్కొన్నారు.

2024-25లో మెటల్‌ కటింగ్‌, ఫార్మింగ్‌ రంగంలో ఉత్పత్తి విలువ రూ.14,510 కోట్లుగా ఉండగా వినియోగం రూ.30,741 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 10 శాతం, 18 శాతం వృద్ధితో రూ.14,655 కోట్లు, రూ.35,705 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు లోకేశ్‌ మెషిన్స్‌ ఎండీ, ఐఎంటీఎంఏ మాజీ ప్రెసిడెంట్‌ ఎం లోకేశ్వర్‌ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

Updated Date - Dec 12 , 2025 | 03:17 AM