ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ 1465 కోట్ల సమీకరణ
ABN , Publish Date - May 16 , 2025 | 04:44 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐకేఎఫ్ ఫైనాన్స్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,465 కోట్లు సమీకరించింది. నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐకేఎఫ్ ఫైనాన్స్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,465 కోట్లు సమీకరించింది. నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్ నుంచి ఈ పెట్టుబడులు సమీకరించినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో 10 కోట్ల డాలర్లకుపైగా (సుమారు రూ.855 కోట్లు) పెట్టుబడులు నార్వెస్ట్ నుంచి సమకూరాయి. మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్ ఇప్పటికే ఉన్న వాటాలకు తోడు అదనంగా మరిన్ని వాటాలు కొనుగోలు చేసింది. ఐకేఎఫ్ ఫైనాన్స్.. వాహన, ఎంఎస్‌ఎంఈ, గృహ రుణాలు అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..